గొర్రెల దొడ్డి పై కుక్కలు దాడి

కొండపాక (జనంసాక్షి) అక్టోబర్ 21 : సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలోని రాంపల్లి గ్రామంలో గురువారం రోజున చుక్క కనకయ్య మరియు చుక్క సాయిలుకు చెందిన గొర్రెల దొడ్డి పై కుక్కలు దాడి చేయడంతో గొర్రె పిల్లలు మరణించడం జరిగింది. ఈ దాడిలో సుమారు 10 గొర్రెల పిల్లలు  మరణించాయి. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్, మరియు పలువురు ఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఇట్టి విషయాన్ని వెటర్నరీ అధికారికి తెలియజేయగా ఘటనస్థలానికి వెళ్లి పంచినామా నిర్వహించడం జరిగింది. సంబంధిత అధికారులు ఇట్టి విషయాన్ని గమనించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చెయ్యాలని గ్రామ సర్పంచ్ సురేందర్ రెడ్డి, బొమ్మ నర్సింలు ,బొమ్మ స్వామి చేయాలని కోరడం జరిగింది.