కూకట్పల్లి (జనంసాక్షి ): తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా అవుల రాజుయాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు నగరంలో రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతులమీదుగా శనివారం రాజుయాదవ్ నియామకపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా రాజుయాదవ్ మాట్లాడుతూ, మేడ్చల్ జిల్లాలో గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు. హక్కుల సాధనకు రాజీలేని విదంగా పాటుపడుతానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు జిల్లాలోని గొర్రెల మేకల పెంపకం వృత్తిదారులకు అందేవిదంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నోఏళ్లుగా వృత్తిదారుల శ్రేయస్సుకు పాటుపడిన తన సేవలకు గుర్తింపుగా జిల్లాస్థాయి పదవి ఇచ్చారని, తనకు ఈ పదవి రావడానికి సహకరించిన ప్రతిఒక్క నేతకు ఈ సందర్భంగా రాజుయాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం అధ్యక్షులు కొమ్ము అశోక్ యాదవ్, సలహాదారు గుడిగే శ్రీనివాస్ యాదవ్, చిగుర్ల శ్రీనివాస్, చేగొండ రాజన్న యాదవ్, రమేశ్ యాదవ్, రాజేందర్ యాదవ్, మధు యాదవ్, సాయిప్రసాద్, నర్సింహులు, మల్లేష్, అంజియాదవ్, శ్రీనివాస్ యాదవ్ లతోపాటు పెద్దసంఖ్యలో వృత్తిదారుల సంఘం నాయకులు పాల్గొని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ను గజమాలతో ఘనంగా సన్మానించి బతుకమ్మ, దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు.
గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా అవుల రాజుయాదవ్ నియామకం




