Wednesday, 4 November 2026

సీఎం కేసీఆర్ రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన ఏడు దొడ్ల

 నాంపల్లి అక్టోబర్ 1 (జనంసాక్షి )సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుల ఇంటింటా తిరిగి రైతుల సమస్యలు తీర్చాలని రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడు దొడ్ల రవీందర్ రెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం నాంపల్లి మండలం లోని 32 గ్రామపంచాయతీ పలు గ్రామాలలో తుంగపాడు, మల్లపురాజు పల్లి, నాంపల్లి, పెద్దాపురం, దామెర, ముష్టిపల్లి, సుంకిశాల, రేవెల్లి గ్రామాలలో రైతులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. అదేవిధంగా ఆయన రైతులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు మునగాల సుధాకర్ రెడ్డి, దండిగా అలివేలు నర్సింహ,మాల్ మార్కెట్ డైరెక్టర్ కడారి శ్రీశైలం యాదవ్, చింతపల్లి మండల పార్టీ అధ్యక్షుడు దొంతం శేఖర్ రెడ్డి,ఉజ్జిని సాగర్ రావు,గున్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి,రవి ,ఉప సర్పంచ్ పచ్చిపాల ఆంజనేయులు,మాజి సర్పంచ్ దండిగా చంద్రయ్య, నీల నర్సింహ,నేతాళ్ల యాదగిరి,గ్రామాశాఖ పులక్కరం వెంకటయ్య,గజ్జేల యాదగిరి రెడ్డి,కోమ్ము నరసింహ, దండిగా ఈదయ్య, ముత్యాలు,గోడ్డేటి పాండు,బోల్గం శేఖర్,వంగాల సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.