*ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు*

 శ్రీరంగాపురం: అక్టోబర్ 1( జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటున్న బతకమ్మ సంబరాలను శ్రీరంగాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థులచే రకరకాల  పూలను తెచ్చి బతుకమ్మలు తయారుచేసి బతుకమ్మలు కొడుతూ ఆటపాటలతో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు అందరూ బొడ్డెమ్మ కొడుతూ బతుకమ్మ సంబరాల పాటలు పాడుతూ సంతోషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు అధ్యాపకులు వెంకటకృష్ణ ,శ్రీనివాసులు, సదయ్య, ఆశాజ్యోతి ,శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్  సైదున్యష బేగం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.