కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మెన్‌కు వినతిపత్రం
హైదరాబాద్,నవంబర్1(జనంసాక్షి): గొల్ల కురుమలకు 1970 వరకు అమలులో ఉన్న సెమినోమాడిక్ ట్రైబ్ రిజర్వేషన్ సాధించడమే ద్యేయంగా గొల్లకురుమ నవ నిర్మాణ సమితి పనిచేస్తుందని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ది రమేష్ యాదవ్ పేర్కొన్నారు. దీనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు
మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను కలిసి గొల్ల కురుమ సమస్యలపైన వినితి పత్రం సమర్పించారు. వినతి పత్రంలో గొల్ల కురుమల అర్దసంచర జాతుల రిజర్వేషన్ పునరుద్ధరణ చేయాలి,
దీన్ని సహకార బోర్డ్ ను పునరుద్ధరించి కార్మికులకు జీవనోపాధి కల్పించాలని కోరారు. ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి 5 లక్షల ఎక్సగ్రేషియో చెల్లించాలి, గొల్లకురుమలలో నున్న స్కూల్ డ్రాప్-అవూట్ నిర్మూలించుటకు ప్రతి జిల్లాకు రెండు ఇంగ్లీష్ విూడియం షెపర్డ్ స్కూల్లను ఏర్పాటు చేయాలని, గొల్లకురుమ గొర్ల – మేకల పెంపకం దారులకు సంబంధించిన 559 జి.ఓ ను మరియు 1016 జి.ఓ ను అమలు చేయాలని పత్రంలో కోరడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచరంను కమిటికి ఇవ్వడం జరిగింది. దినిపై కమిటి చైర్మెన్ సానుకులంగ స్పందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జి.కె.ఎన్. ఎస్ సిద్ధాంత కర్త ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ భీనవేని రాము యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు దాసరి నగేష్ యాదవ్,రాష్ట్ర కార్యదర్శి బోర్రాజు వెంకట్ యాదవ్, రాష్ట్ర మహిళ అధ్యక్షులు సందవేణి మంజులవాణి యాదవ్ పాల్గొన్నారు.




