గొల్లపల్లి లో ఘనంగా స్వాతంత్ర్య

దినోత్సవ వేడుకలు.
ఫోటో రైటప్: జెండా ఆవిష్కరిస్తున్న సర్పంచ్ ఇందూరి శశికళ.
బెల్లంపల్లి, ఆగస్టు15, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామంలో సోమవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గొల్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ఇందూరి శశికళ జాతీయజెండా ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. మిఠాయిలు పంచి పెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. వికలాంగురాలు అయిన చల్లురి లక్ష్మీ అనే మహిళకు సదరం సర్టిఫికెట్ అందజేశారు. ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రంజిత్, సింగిల్ విండో మాజీ చైర్మన్ ఇందూరి రమేష్, ఉప సర్పంచ్ జాడి నారాయణ, వార్డు సభ్యులు, కో అప్షన్ సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు పిల్లలు పాల్గొన్నారు.