దినోత్సవ వేడుకలు.
ఫోటో రైటప్: జెండా ఆవిష్కరిస్తున్న సీనియర్ సిటిజన్ శంకర్ సింగ్
బెల్లంపల్లి, ఆగస్టు15, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం నందులపల్లి గ్రామంలో సోమవారం ఆజాదికా అమృత్ మహోత్సవ్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రైతులందరికీ పెద్ద దిక్కు అయిన తిమ్మయ్య చెరువు సీనియర్ సిటిజన్ ఠాకూర్ శంకర్ సింగ్ చే జాతీయ జెండా అవిష్కరింపజేశారు. జాతీయ గీతాన్ని ఆలపించి, మిఠాయిలు పంచి పెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈకార్యక్రమంలో సర్పంచ్ బోయిని మల్లేష్, ఏపీఓ నరేష్, ఈసీ మధు, పంచాయతీ కార్యదర్శి పద్మనాభం, టెక్నికల్ అసిస్టెంట్ రాజేంద్రప్రసాద్ వార్డు సభ్యులు, కో అప్షన్ సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు పిల్లలు పాల్గొన్నారు.
నందులపల్లిలో ఘనంగా స్వాతంత్ర్య




