గోపాల శ్రీకాంత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్

కేసముద్రం ఆగస్టు 15 జనం సాక్షి / మండలంలోని దన్నసరి గ్రామానికి చెందిన గోపాల శ్రీకాంత్ రెడ్డి ఇటీవలే మృతిచెందగా విషయం తెలుసుకున్న మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ వారి స్వగృహానికి చేరుకుని శ్రీకాంత్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించినారు.అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నునావత్ రాధ,పీసీసీ సభ్యులు దసురు నాయక్,మండల అధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి,సింగల్ విండో బ్యాంక్ వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వరరావు, కల్వల సర్పంచ్ గంట సంజీవ రెడ్డి, బండారు వెంకన్న,హెచ్. వెంకటేశ్వర్లు,దన్నసరి ఎంపీటీసీ బాలు నాయక్,యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాణోత్ వెంకన్న నాయక్,సబ్ స్టేషన్ సర్పంచ్ వెంకన్న, గ్రామ పార్టీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి,గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి,వార్డు సభ్యులు సురేష్,నరేందర్,మునేశ్,సారంగం,సత్యానందం,మహేష్,యాదగిరి,అరవింద్, సుధాకర్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.