గ్యాస్ సిలిండర్ ధరల పెంపుతో సామాన్యుడి బతుకు ఆగం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్
మక్తల్ జూలై 08 (జనంసాక్షి) పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఎమ్మెల్యే శ్రీ.చిట్టెం రాంమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మగనూర్ మండల కేంద్రం లో జాతీయ రహదారిపై కట్టెల పొయ్యి పెట్టి ధర్నా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు గ్యాస్ సిలిండర్ ధరల పెంపుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యుడి బతుకు ఆగం చేస్తున్నారు అని అన్నారు
ప్రధాని నరేంద్ర మోడీ పై వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మగనూర్ మండల జెడ్పిటిసి, సర్పంచులు ఎంపిటిసిలు, TRS పారీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Attachments area