మల్లాపూర్ ఏప్రిల్ :11(జనం సాక్షి) మండలంలోనివేంపల్లి గ్రామానికి చెందిన l మక్కల చిన్న ఎల్లయ్య (70) అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబానికి గ్రామ పంచాయతీ తరుపున 10,000/-(పది వేల) రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బిట్ల సరోజన నరేష్, ఉప సర్పంచ్ వెల్మల రాజానర్సయ్య, ఎంపిటిసి భూమి రాజేందర్, వార్డ్ మెంబర్ గుగులావత్ జహీందర్ పాల్గొన్నారు.




