దేవరకొండ ఎమ్మెల్యే, నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీంద్ర కుమార్ నాయక్
కొండమల్లేపల్లి ఫిబ్రవరి 1 (జనంసాక్షి) న్యూస్ :ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాలకు మహర్దశ వచ్చింది అని దేవరకొండ శాసన సభ్యులు, నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.బుధవారం మన ఊరు మన -ప్రభుత్వం మన పథకాలు కార్యక్రమంలో భాగంగా కొండమల్లెపల్లి మండలం చెన్నారం గ్రామంలో రూ.25లక్షల సీసీ రోడ్డు పనులకు,రూ.21లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రారంభం చేశారు.ఈ సందర్భంగా గ్రామంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.గ్రామాలు సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.మిషన్ భగీరథ ద్వార ప్రతి ఇంటింటికి సురక్షితమైన తాగు నీరు అందించడం జరిగింది అని ఆయన తెలిపారు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా అని ఆయన అన్నారు.తెలంగాణలో అన్ని వర్గాలకు మంచి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నది బిఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన తెలిపారు.దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది అని ఆయన పేర్కొన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందజేస్తున్న రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ పథకాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించాలని కార్యకర్తలను కోరారు. అంతేగాకుండా, గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్ల నిర్మాణం, చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను ప్రభుత్వం అందజేస్తున్నదని చైతన్యపర్చాలని కోరారు. ప్రతీ గ్రామంలో రైతులను విజ్ఞానవంతులుగా చేసేందుకు రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించిందని చెప్పాలని కోరారు. పేదింటి అడబిడ్డల పెండ్లి కోసం కల్యాలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా ప్రభుత్వం రూ.1,00,116 ఆర్ధిక సాయం అందజేస్తున్నదని అన్నారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు కేసీఆర్ కిట్స్ అందజేస్తున్నదని అన్నారు నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తున్నదని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి, రైతు బంధు అధ్యక్షులు కేసాని లింగా రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమావత్ దసృ నాయక్,మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్,ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రమావత్ తులసిరామ్ నాయక్, స్థానిక సర్పంచ్ ఎద్దుళ్ళ కళావతి,ఎంపీటీసీ జగన్ నాయక్, మాజీ సర్పంచులు రమావత్ శ్రీను నాయక్, రమావత్ లాలూ నాయక్,గ్రామ శాఖ అధ్యక్షుడు జంగిటి వెంకటేష్,సర్పంచులు రమావత్ బీమ్ సింగ్ నాయక్, రమావత్ రాములు నాయక్ ,బోడ్డుపల్లి కృష్ణ,ఎంపీడీఓ బాలరాజు రెడ్డి, వీరస్వామి,విశ్వనాధం,రమావత్ కృష్ణ, కబీర్, పరిపూర్ణచారి, అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




