బిజేపి జిల్లా ప్రధనకార్యదర్శి యు. రమేష్‌కుమార్
తాండూరు 26 మే(జనంసాక్షి) గ్రామీణ ప్రాంతప్రజల్లో వెలుగులు నింపిన ఘనత బిజేపి ప్రభుత్వానికే దక్కిందని బిజేపి జిల్లా ప్రధానకార్యదర్శి యు. రమేష్‌కుమార్ అన్నారు. శనివారం పట్టణంలొని నేతాజీ చౌక్‌లో కేంధంలో ని బిజేపి ప్రభుత్వం నాలుగేళ్ళు పూర్తయిన సందర్బంగా పట్టణంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ప్రధానకార్య దర్శి యు.రమేష్‌కుమార్ మాట్లాడుతూ దేశ అంతర్గత భద్రతను కాపాడు తూ ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుం దన్నారు. దేశంలో విద్యుత్ కోరత లేకుండా ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించిన ఘనత బిజేపి ప్రభుత్వానిదే అన్నారు. ఎస్సీ, ఎస్టీల కు ఉచిత గ్యాస్ కనెక్షన్‌లు అందిస్తూ గ్రామీణ ప్రజల్లో వెలుగులు నింపు తున్నారని అన్నారు. పేద ప్రజలకు ఉచిత గ్యాస్ అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అనంతరం పట్టణ అధ్యక్షులు బంటారం భద్రేశ్వర్ మాట్లాడుతూ ఆహారద్యాన్యాలపై ట్యాక్స్‌ను ఎత్తివేసి ధరలు స్థీరీకరించిరాని అన్నారు. సరుక్ష భీమాపథకం కింద 150 మంది దినసరి కూలిలను భీమా చేయించడం జరిగిందన్నా రు. ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి కేశగిరి ప్రవీణ్‌కుమార్, అంతార లలిత, సుజాత, బీరప్ప, సుధాకర్‌రెడ్డి, రామ్యానాయక్, శివకుమార్, అనిత తో పాటు తదితరులు ఉన్నారు.
గ్రామీణ ప్రాంతప్రజల్లో వెలుగులు నింపిన ఘనత బిజేపిదే




