Wednesday, 4 November 2026

గ్రామీణ ప్రాంతాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం

గ్రామీణ ప్రాంతాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం..
అన్ని వర్గాల ప్రజలకు అండ టిఆర్ఎస్ ప్రభుత్వం…
శంకరపట్నం: జనం సాక్షి డిసెంబర్ 4
తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా, అన్ని వర్గాలకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడని మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక రథసారధి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు. ఆదివారం శంకరపట్నం మండలంలోని కేశవపట్నం, గొల్లపల్లె, కొత్తగట్టు, కల్వల గ్రామాల్లో ఎమ్మెల్యే బాలకిషన్ ముఖ్య అతిథిగా హాజరై రేషన్ దుకాణాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి మాట్లాడారు. తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యముగా నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని ప్రవేశపెట్టి నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుచేసి ప్రజా అవసరాల కోసం వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిధులు విడుదల చేస్తున్నాడని పేర్కొన్నారు. అందులో భాగంగా శంకరపట్నం మండలంలో నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి, ప్రజలు నిత్యావసర సరుకులను తీసుకునే రేషన్ దుకాణాలను మంజూరు చేసి ప్రజా అవసరాలను తీరుస్తున్నట్లు చెప్పారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం, మురుగు కాలువలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో అర్హులందరికీ నూతనంగా ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వము 3 లక్షల రూపాయల ను అందజేయుటకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ సరోజన, వైస్ ఎంపీపీ రమేష్, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి ఎంపిటిసి లో పూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మహిపాల్, సర్పంచులు రాజయ్య, భద్రయ్య, వెంకటరమణారెడ్డి, రజిత, మానస, అనూష, టిఆర్ఎస్ పార్టీ నాయకులు సతీష్ రెడ్డి, శ్రీనివాస్, రవి, సుధాకర్, తో పటు టిఆర్ఎస్ నాయకులు ,కార్యకర్తలు ,గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.