గ్రామ అబివృద్ది కై సాధారణ సమావేశం_
*దోమ న్యూస్ జనం సాక్షి.
దోమ గ్రామపంచాయతీ సాధారణ సమావేశం సర్పంచ్ కె రాజిరెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగింది తడి పొడి.చెత్త వ్యక్తిగత మరుగుదొడ్లు కొత్త పెన్షన్ ల జాబితా నూతన అండర్ డ్రైనేజీ. సీసీ రోడ్ల నిర్మాణం గ్రామ కరెంట్ సమస్యల కై విద్యుత్ స్టాంబాల ఏర్పాటు పంచాయతీ నిధుల ఖర్చులు తదితర సమస్యలపై సమావేశం లో చర్చించారు గ్రామంలో పూర్తి స్థాయిలో సీసీ రోడ్ల నిర్మాణంకు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సహకారం తో 50/లక్షల ఉపాధి హామీ నిధులు తెప్పించాలని సమావేశం అభిప్రాయ పడింది ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్ గ్రంథాలయ డైరెక్టర్ యాదయ్య గౌడ్ పంచాయతీ కార్యదర్శి చెంద్రశేఖర్,వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.*