గ్రామ కమిటీలు,భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు

గ్రామ కమిటీలు,భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు

బషీరాబాద్ సెప్టెంబర్ 27,(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలోని బుధవారం రోజున టీపీసిసి ఉపాధ్యక్షులు యం.రమేష్ మహారాజు ఆదేశం మేరకు బషీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కలాల్ నర్సిములు గౌడ్ ఆధ్వర్యంలో మంతట్టి,రెడ్డి ఘణ పూర్,మాసంన్ పల్లి, కోర్వి చేడ్ గ్రామలలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలు వేయడం జరిగింది.మంతట్టి గ్రామ అధ్యక్షులు నటిగారి అంజిలప్ప,రెడ్డి ఘనపూర్ గ్రామ అధ్యక్షులు ముదిరాజ్ మాణిక్యప్ప, మాసన్ పల్లి గ్రామ అధ్యక్షులు వడ్డే రాములు, కొర్వీ చెడు గ్రామ అధ్యక్షులు పట్లోళ్ళ రామ్ రెడ్డి నియమితులయ్యారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉత్తమ్ చంద్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మన్ రావు,కాంగ్రెస్ కార్యకర్తలు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.