Wednesday, 4 November 2026

గ్రామ గ్రామానికి సంక్షేమ పతకాలు

నారాయణఖేడ్ ఆగస్టు28(జనంసాక్షి)
నారాయణఖేడ్ నియోజకవర్గంలో ని
కంగ్టి మండలం దామర్గిద్ద గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభోత్సవానికి విచ్చేసిన   శాసనసభ్యులు ఎం భూపాల్ రెడ్డి ని ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు
24 ఆసరా పెన్షన్ పాత్రని అందజేత
20 లక్షల రూపాయలతో sc కమ్యూనిటీ హాల్,సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు,
ఆసం పండరి కుమార్తె కు కళ్యాణ లక్ష్మి చెక్కుఅందజేశారు,
రూపాయలు 5 లక్షలతో నిర్మించిన సైడ్ డ్రైన్, 5 లక్షలతో సీసీ రోడ్డు ను ప్రారంభించినారు,
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో
ఎమ్మెల్యే  మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా మన ప్రాంతంలో అభివృద్ది నేడు జరిగింది అని హితవు పలికారు,ఈకార్యక్రమంలో
మండల జెడ్పీటీసీ లలిత  ఆంజనేయులు,ఎంపీపీ సంగీత  విట్టల్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు   ఎస్కే గంగారాం,సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సిద్దు పాటిల్,మండల పార్టీ ఉపాధ్యక్షులు దత్తు రావు,ఎంపీటీసీ లు ముత్యాల సాయిలు, శ్రీకాంత్,సర్పంచ్ లు లక్ష్మి -రవి, బస్వరజ్,యాదయ్య,ఉప సర్పంచ్ సాయిలు,మండల నాయకులు కృష్ణా ముదిరాజ్, నాగన్న శెట్కార్,మాణిక్ రెడ్డి,అశోక్ రావు,సంజీవ్ పాటిల్, విట్టల్,యువ నాయకులు కాలే రాజు,మహిపాల్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.