Wednesday, 4 November 2026

చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ

ఇబ్రహీంపట్నం , ఆగష్టు 28 , (జనం సాక్షి )  ఉద్యమాలకు ఊపిరి పోసి ఎన్నో పోరాటాలు చేసిన చాకలి ఐలమ్మను మరువలేమని టీఆర్ఎస్ నాయకులు కల్వకుంట సంజయ్ అన్నారు.ఈ మేరకు ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు.అనంతరం మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాటం ఆదర్శ ప్రాయమని, తెలంగాణ కోసం ఆమె పోరాడిన స్ఫూర్తి మరువలేనిదని , భావి తరాలకు ఆమె పోరాట పటిమ స్పూర్తిదాయకమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సున్నం సవ్యశ్రీ సత్యం ,ఎంపీటిసీ , పిఎసిఎస్ అధ్యక్షులు , వివిధ గ్రామాల సర్పంచులు , ఎంపీటీసీలు , టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు , నాయకులు , రజక సంఘ సభ్యులు , ప్రజలు తదితరులు పాల్గొన్నారు.