ఘనంగా ముగిసిన మొహరం వేడుకలు
జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలో మొహరం (పీరీల పండుగ) శనివారం ఘనంగా ముగిశాయి. మండలంలోని గుండారం కమాన్ పూర్ జూలపల్లి పే రా పల్లి రొంపి కుంట తోపాటు తదితర గ్రామాల్లో పీర్ల పండుగలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కుల మతాల కతీతంగా ఈ వేడుకలను ఈ జరుపుకుంటారు. మొహరం నెల ప్రారంభంలో పీరీలను ఆశూర్ ఖానాలో కూర్చోబెట్టి పది రోజుల పాటు ఆశుర్ ఖానా వద్ద గుండం ఏర్పాటు చేసి తెలంగాణ యాసలో చుట్టూ తిరుగుతూ పాటలను పాడారు. పదవరోజు పీరిలాను ఆయా గ్రామాల్లో డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగించి సాయంత్రం చెరువుల వద్దకు బావల వద్దకు తీసుకెళ్లి శాంతింపజేశారు. గ్రామాల్లో వివిధ వేషధారణలో ప్రజలు పాల్గొన్నారు. భక్తులు భారీ ఎత్తున హాజరై పీరీలకు కుడుకలు దట్టీలు సమర్పించారు. గత పది రోజులుగా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది శనివారంతో మొహరం వేడుకలు ముగిసాయి.