Wednesday, 4 November 2026

గ్రామ స్థాయిలో బీఎస్పీ పార్టీని బలోపేతం చేయాలి

వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి సీఎం నర్సింలు
మోమిన్ పేట ఆగస్టు 28 జనం సాక్షి
బహుజన సమాజ్ పార్టీ ని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ సీఎం నర్సింలు  పేర్కొన్నారు ఆదివారం మోమిన్ పేట మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాదులో ఎమ్మెల్యే స్థానం కైవసం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రతి కార్యకర్త వీర సైనికుడు వలె కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో మండల బి ఎస్ పి అధ్యక్షుడు కోల్కొంద రాజు నాయకులు బొంబాయి రాజు మహేందర్ ప్రవీణ్ సురేందర్ జగదీష్ పరమేశ్ నియోజకవర్గంలో ఈ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు