– తన ఇంటి పెరట్లో మూడు మొక్కలు నాటిన మెగాస్టార్
– పవన్ కళ్యాణ్, అమితాబ్, రామోజీలకు ఛాలెంజ్ ఇచ్చిన చిరు
హైదరాబాద్, జులై31(జనం సాక్షి ) : అగ్ర కథానాయకుడు చిరంజీవి హరిత సవాలు (గ్రీన్ ఛాలెంజ్) స్వీకరించారు. తన ఇంటి మంగళవారం పెరట్లో మూడు మొక్కలు నాటి తన ఫేజ్ బుక్‌లో పోస్టు చేశారు. .అనంతరం తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు, ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌ను నామినేట్ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ గ్రీన్ ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇప్పటికే పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తమ స్నేహితులను నామినేట్ చేస్తూ సోషల్‌విూడియాలో పోస్ట్‌లు చేశారు. మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత, సీనియర్ నటుడు మోహన్‌బాబు, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, కథానాయకుడు మహేశ్‌బాబు, క్రికెటర్ సచిన్ తెందూల్కర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా తదితరులు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించారు. కాగా ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి చిరంజీవికి గ్రీన్ చాలెంజ్ కు నామినేట్ చేశారు. దీంతో మంగళవారం చిరు తన పెరట్లో మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ చాలెంజ్ విసిరారు. చిరు ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ సినిమాను నిర్మిస్తున్నారు. స్వాతంత్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా ఇది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.




