Thursday, 5 November 2026

గ్రూపులున్నా కాంగ్రెస్‌లో ఎన్నికల జోష్‌

ఎక్కడికక్కడ నేతల పర్యటనలతో ప్రచారాలు

హైదరాబాద్‌,జూలై21(జ‌నం సాక్షి): వచ్చే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది గమనిస్తే ఎవరిని అడిగినా మళ్లీ టిఆర్‌ఎస్‌ అనే అంటున్నారు. కెసిఆర్‌ను ఢీకొనే నేత లేరని అంటున్నారు. జిల్లాల్లో ఎక్కడికి వెల్లినా కామన్‌గా వినిపించే డైలాగ్‌ ఇది. కాంగ్రెస్‌లో లీడర్‌ సమస్య ఉందని ప్రజలు బాహాటంగానే అంటున్నారు. అయితే ఇందుకు భిన్నంగా విమర్శలను పక్కన పెట్టి కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఏదో ఒక కార్యక్రమంతో ఆయా జిల్లాల్లో ప్రచార¬రులో మునిగిపోతోంది. ముందస్తు ఎన్నికల సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో కార్యక్రమాలు సాగుతున్నాయి. ఎవరికి వారు నియోజకవర్గ స్తాయిలో పనులు చేసుకుంటూ పోతున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు, నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాల మధ్య సమన్వయం కుదరకున్నా నేతలు ఏదో కార్యక్రమం చేపట్టేలా పార్టీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని నిలువరించా లంటే ముందుగా పార్టీలో ఐక్యత ముఖ్యమని భావిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు ప్రయత్నాలు ఆరంభించింది. ఈ దిశగా జిల్లాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తోంది. ఇటీవల తెలంగాణకు ఇన్‌చార్జీలుగా నియమితులైన ముగ్గురిలో ఒకరైన ఏఐసీసీ కార్యదర్శి, శ్రీనివాసన్‌ కృష్ణన్‌ తదితరులు పర్యటనలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వర్గపోరు, గ్రూపు రాజకీయాలు మాత్రం కొనసాగుతున్నాయని ఆదిలాబాద్‌ మొదలు హైదరాబాద్‌, నల్లగొండ సమావేశాలు రుజువు చేశాయి. కొద్ది నెలలుగా రాష్ట్రంలో పరిణామాలు జిల్లా రాజకీయాల్లోనూ వర్గపోరును తేటతెల్లం చేస్తున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాల నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో ఉత్సాహం కనిపిస్తోంది. ప్రధానంగా ఇన్‌చార్జీలు పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయిలో పార్టీ ముఖ్య నేతల మధ్య సమన్వయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ఉమ్మడి జిల్లాల్లో పార్టీ పరిస్థితి, కార్యకర్తల మనోగతం తెలుసుకునేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో నెలకొన్న సమస్యలను గుర్తించి అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆగస్టు, సెప్టెంబర్‌లోనే నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం మన్ననల కోసం నియోజకవర్గ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క ఇటీవల టీపీసీసీలో కొత్త

జిల్లాలకు అధ్యక్షులను నియమించాలనే తీర్మానం కూడా చేసినట్లు జిల్లా నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.