గ్రూప్ 1 పరీక్షల అవకతవకాలపై విచారణ జరిపించాలి.అఖిల భారత యువజన సమాఖ్య ( ఏవైఎఫ్)డిమాండ్.
నేరేడుచర్ల(జనంసాక్షి )న్యూస్.తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల16 న గ్రూప్ 1పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా ఉదయం10:30 నుండి మధ్యాహ్నం 1:00 వరకు నిర్వహించారు.అయితే హైదరాబాద్ లాల్ పేట శాంతినగర్ లోని ఎస్ఎఫ్ఎస్ ( సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్స్ ) హై స్కూల్ పరీక్ష కేంద్రంలో మధ్యాహ్నం1:00 నుండి 3:30 నిమిషాల వరకు పరీక్ష నిర్వహించారని.ఉదయం నిర్వహించాల్సిన పరీక్ష మధ్యాహ్నం నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని, దీనిపై ఆరోపణలు వస్తున్నాయని,రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించి,బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్,సూర్యాపేట జిల్లా పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చిలకరాజు శ్రీను మాట్లాడుతూ లాల్ పేట ఎస్ ఎఫ్ ఎస్ పాఠశాలలో నిబంధనలకు వ్యతిరేకంగా మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని,అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి రహస్య పరీక్ష కేంద్రాల్లో కూడా గ్రూప్ 1పరీక్ష కేంద్రాలు ఉండొచ్చని,ఆరోపణల పై విచారణ ద్వారా నిగ్గు తేల్చాలని ఇలాంటి తప్పిదాలపై ప్రభుత్వం సంబంధిత అధికారులు స్పందించి అక్కడి యాజమాన్యం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
లక్షలాదిమంది అభ్యర్థుల భవిష్యత్తుపై ఆధారపడిన ఈ పరీక్షను సమర్థవంతంగా నిర్వహించాల్సిన టిఎస్పిఎస్సి నిర్లక్ష్యంగా నిర్వహించడం విచారకరమని,ఇప్పటికైనా స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతను సమీకరించి పోరాటం చేస్తామని, ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Attachments area