Thursday, 5 November 2026

మహాసభకు బయలుదేరిన కార్మిక సంఘాల నాయకులు..

ఏఐటియుసి మండల అధ్యక్ష కార్యదర్శులు బత్తుల సత్యం, శివరాత్రి సమ్మయ్య.
రామన్నపేట అక్టోబర్ 21 (జనంసాక్షి) ఆలేరులో జరిగే ఏఐటీయూసీ  జిల్లా రెండవ మహాసభలకు లారీ ,ట్రాక్టర్, భవణ నిర్మాణ కార్మిక సంఘం, గన్ను దెబ్బ , మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ సంఘాల నాయకులు, కార్మికులందరం  బయలు దేరామని, ఏఐటియుసి మండల అధ్యక్ష,  కార్యదర్శి బత్తుల సత్యం ,శివరాత్రి సమ్మయ్య తెలిపారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టవలసిన అవసరం ఉందని, ఉద్యమాల ద్వారా ఎలాంటి ప్రభుత్వాల మెడలైనా వంచి విజయాలు సాధించవచ్చని, రైతు చట్టాలను  రద్దు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని దిగి వచ్చేలా చేసిన రైతు ఉద్యమమే మనందరికీ స్పూర్తి అని తెలిపారు… మహాసభ కు వెళ్లిన వారిలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు దుర్యోధన్ , నంగనూరు యాదయ్య లారీ డ్రైవర్స్ క్లీనర్స్ యూనియన్ అధ్యక్షులు  గోపగోని అశోక్, బెల్లి అంజయ్య, పర్సా సుదర్శన్, బుర్ర శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
Attachments area