తెలంగాణలో గ్రూప్-2 కేటగిరి పోస్టుల ఎంపికకు తొలి రెండు పేపర్ల పరీక్షలు శుక్రవారం అభ్యర్ధుల ఇబ్బందుల మధ్య జరి
గాయి. తెలంగాణ ఆవిర్భావం తరువాత జరుగుతున్న తొలి మెగా ఎంపిక పరీక్ష కావడంతో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసినా అభ్యర్ధులకు మాత్రం ఇబ్బందులు తప్పలేదు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఎటిఎంలు పనిచేయక అభ్యర్ధులు చిల్లర కష్టాలు ఎదుర్కొన్నారు. అభ్యర్ధులకు 40 నుండి 60 కిలోమీటర్ల దూరంలోని పరీక్ష కేంద్రాలను కేటాయించడం వల్ల సకాలంలో చేరుకోలేకపోయారు. కొంతమంది వద్ద చిల్లర లేక, 500 నోట్లు చెల్లకపోవడంతో సకాలంలో కేంద్రాలకు చేరలేక పరీక్ష రాయడం మానుకున్నారు.
గ్రూప్-2 అభ్యర్ధులకు తప్పని కష్టాలు




