Tuesday, 3 November 2026

గ్రూప్ -2 పరీక్షలకు సర్వం సిద్ధం

గ్రూప్ -2 పరీక్షలకు సర్వం సిe87b9e62d7c7d249d4854c57b58d291d_mద్ధమైంది. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 263 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా,1,15, 968 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7.5 లక్షల పైచిలుకు అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతుండగా, అత్యధిక మంది హైదరాబాద్ జిల్లాలోనే పరీక్ష రాయబోతున్నారు. 20 శాతానికి పైగా అభ్యర్థులు ఇక్కడే పరీక్ష రాయనుండటంతో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. 24 మంది అభ్యర్థులకొక ఇన్విజిలెటర్ చొప్పున విధులు కేటాయించారు. 500 మంది అభ్యర్థులకంటే మించి ఉన్న కేంద్రాల్లో అధనంగా ఒక సూపర్‌వైజర్‌ను నియమించారు. అత్యవసర చికిత్సకోసం మెడికల్ కిట్లు, 108 వాహనాలను అందుబాటులో ఉంచుతున్నారు. పరీక్షా కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరానందించనున్నారు. పరీక్షా కేంద్రాలన్నింటికి మెడికల్ కిట్లను అందించనున్నారు. 108 సర్వీసులను సైతం అందుబాటులో ఉంచుతున్నారు.అలాగే పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అంక్షలను విధించారు. 1000 ఆర్టీసీ బస్సులను నడపనున్నట్లు ఈడీ పురుషోత్తంనాయక్ ప్రకటించారు. 11వ తేదీ నుంచి 13 వరకు బస్సులను నడపబోతున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *