హైదరాబాద్ : ఎల్ బినగర్ లో గ్రేటర్ కాంగ్రెస్ కార్యకర్తలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఉత్తమ్ మాట్లాడారు. విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా ముందుకెళ్లాలని సూచించారు. సేవ్ హైదరాబాద్ నినాదంతో కార్యకర్తలు జనంలోకి వెళ్లాలని, గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని సూచించారు. టీఆర్ఎస్ పది నెలల పాలనలో ఫిరాయింపులను ప్రోత్సాహించడం తప్ప చేసేందేమి లేదని, టీఆర్ఎస్ రాజకీయ విలువలను దిగజార్చిందని ఉత్తమ్ విమర్శించారు. కాంగ్రెస్ వెంట ఉంటేనే సెటిలర్స్ కు న్యాయం జరుగుతుందని, వికారుద్దీన్ ఎన్ కౌంటర్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.




