*ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం*

మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 11,
జనంసాక్షి
మెట్పల్లి పట్టణ కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో మంగళవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బాలికల దినోత్సవం పురస్కరించుకొని అంగన్వాడి సిడిపిఓ తిరుమల దేవి ఆధ్వర్యంలో బంటు పేట జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్ మెట్పల్లి పాఠశాలలో డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు,
ఈ సందర్భంగా సిడిపిఓ తిరుమల దేవి మాట్లాడుతూ బాలికల భద్రత రక్షణ చట్టాల గురించి , అదేవిధంగా బాలికల పౌష్టిక ఆహారము ఏ విధంగా తీసుకోవాలో వారి జాగ్రత్తల గురించి వివరించారు,విద్యలో మంచి నైపుణ్యం సాధించాలని అన్నారు ,ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజన్న అంగడి వాడి టీచర్లు సుమ, లావణ్య ,సుజాత ,అనురాధ విజయలక్ష్మి ,స్రవంతి ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు