సికింద్రాబాద్ (జనం సాక్షి ): సితాఫలమండీ లోని సెట్విన్ శిక్షణా కేంద్రంలో కొత్తగా హోటల్ మేనేజ్ మెంట్ కోర్సును ప్రవేశ పెట్టనున్నట్లు సెంటర్ కోఆర్డినేటర్ నవీన్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం నుంచి ప్రారంభించే కొత్త కోర్సును తెలంగాణా ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ గారు ప్రారంభిస్తారని, సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. 30 రోజుల పాటు గృహిణు లకు ప్రత్యేకంగా నిర్వహించే హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అయన తెలిపారు. ఈ నెల హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో అడ్మిషన్ పొందే వారికి ఫీజుల్లో 50 శాతం రాయితీని కల్పిస్తామని ఈ సదుపాయాన్ని సికింద్రాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల వారు సద్వినియోగం చేసుకోవాలని అయన సూచించారు.
సితాఫలమండీ సెట్విన్ శిక్షణా కేంద్రంలో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సులు




