ఘనంగా అమావాస్య పూజలు

కిట కిటాలడిన దేవాలయాలు
అగస్టు27( జనంసాక్షి) గట్టు శ్రావణమాసము అమావాస్య కావడంతో భక్తులు అధికసంఖ్యలో దేవాలయాలు చేరుకొని ఘనంగా పూజలు నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో మండల కేంద్రం తో పాటు మండల పరిధిలోని మాచర్ల బల్గెర ఇందువాసి చాగదొణ మిట్టదొఢ్డి అరగిద్ద పెంచికలపాడు ఆలూరు గోర్లఖాన్ దొడ్డి తప్పెట్లమెర్సు తదితర గ్రామాలలో మహిళలు అయా దేవాలయాలో చివరి శ్రావణశనివారం   అమావాస్య  పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేసారు   అనంతరం భక్తులకు అన్నదానం నిర్వాహకులు నిర్వహించారు భజన కార్యక్రమం నిర్వహించారు తీర్థ ప్రసాదాలు  భక్తులకు    పంపిణీ చేసారు