Wednesday, 4 November 2026

ఘనంగా ఆజాద్ జయంతి వేడుకలు

శనివారం శామీర్ పేట లో స్వాతంత్ర్య సమర యోధులు చంద్ర శేఖర్ ఆజాద్ 116 వ జయంతి సందర్భంగా కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి టీఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ చంద్ర శేఖర్ ఆజాద్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు . ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వీరుడని ఆయన ఆశయాలు యువత కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తోపాటు టీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి, షేక్ చాంద్ పాషా, కేసీఆర్ సేవాదళం మండల అధ్యక్షులు మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్, కేసిఆర్ సేవాదళం మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి నర్సింహ రెడ్డి, మండల టీఆర్ఎస్ నాయకులు తాడెం కుమార్ తదితరులు పాల్గొన్నారు.
23 ఎస్పీటీ -2: నివాళులు అర్పిస్తున్న నాయకులు