Wednesday, 4 November 2026

ఘనంగా ఆల్ఫోర్స్ అనివల్ డే ప్రోగ్రాం.

..ఘనంగా ఆల్ఫోర్స్ అనివల్ డే ప్రోగ్రాం…
హాజరైన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి.
భైంసా రూరల్ మార్చ్ 27 జనం సాక్షి నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని స్థానిక ఎన్ఆర్ గార్డెన్లో సోమవారం ఆల్ఫోర్స్ విద్యాసంస్థ యాన్యువల్ డే ప్రోగ్రాం ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు… విద్యార్థులు చదువుతోపాటు అన్ని సంస్కృతిక కార్యక్రమాలలో ముందు ఉండాలని,ప్రతి ఒక్క విద్యార్థి విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.