ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 25, (జనం సాక్షి ) :  స్టేషన్గన్పూర్, చిల్పూర్ మండలాల పరిధిలో గల అన్ని గ్రామాల్లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో సర్పంచులు, సంబంధిత అధికారులు బతుకమ్మ ఆట స్థలాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసి, వేదికల వద్ద లైట్లు కూడా ఏర్పాటు చేశారు. మహాలయ అమావాస్య సందర్భంగా బతుకమ్మ పండుగ పుర స్కరించుకుని ఆయా గ్రామాల్లో మహిళలు వివిధ రకాల బతుకమ్మ పాటలు పాడుతూ,బతుకమ్మ ఆడుతూ ఆనందంగా సంబరాలు జరుపుకున్నా రు. బతుకమ్మ వేదికల వద్ద ఏసీపీ రఘుచందర్, సీఐ రాఘవేందర్, ఎస్ఐ శ్రవణ్ కుమార్,చిల్పూర్ ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు లో పాల్గొన్నారు.