ఘనంగా కాళోజి జయంతి వేడుకలు

ఆత్మకూరు(ఎం) సెప్టెంబర్ 9 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో కాళోజి నారాయణరావు గారి జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి సర్పంచ్ నాయిని నరసింహారెడ్డి ఎంపీటీసీ సభ్యులు సోలిపురం మల్లారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహోన్నత వ్యక్తి కాళోజీ అని తన కవిత్వంతో రాష్ట్ర ప్రజలను మేలుకొలుపిన మహనీయుడు మన కాళోజీ అని వారి జయంతి మనకి పండుగ రోజు అని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు లోడి శ్రీహరి గౌడ్ సోలిపురం నర్సింహారెడ్డి పంచాయతీ కార్యదర్శి ఇంజ నరేష్ కారోబార్ నోముల స్వామి గ్రామ ప్రజలు ఏనుగు మధుసూదన్ రెడ్డి బండి మల్లయ్య సోలిపురం వెంకటరెడ్డి సామ నరేందర్ రెడ్డి పెసరకాయల నరసింహారెడ్డి గర్శకోట యాదగిరి గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు