ప్రజా కవి శ్రీ కాళోజీ నారాయణ రావు జయంతిని పురస్కరించుకుని క్యాతనపల్లి పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి మునిసిపల్ చైర్పర్సన్ జంగంకళ,కమిషనర్వెంకటనారాయణలు పూలమాల వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా చైర్పర్సన్, కమిషనర్లు మాట్లాడుతూ…… ప్రజాకవి కాళోజి నారాయణ రావు జయంతిని ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుతోందన్నారు. పుట్టుక నీది… చావు నీది… బతుకంతా దేశానిది అని నినదించిన తెలంగాణ ఉద్యమకారుడు కాలోజీ నారాయణరావు అన్నారు. తెలంగాణ యాసను, భాషను తన రచనలతో ఎలుగెత్తి చాటిన ఆయన నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో కవితలురాశారని,”నాగొడవ”లోసంకలనంలో తెలంగాణ ప్రజల గోసను ప్రపంచానికి తెలియజేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రేవెల్లి ఓదెలు, జాడి శ్రీనివాస్, మేనేజర్ కె. నాగరాజు, రెవిన్యూ అధికారి పి. కృష్ణ ప్రసాద్, అసిస్టెంట్ ఇంజనీర్ ఏ.అచ్యుత్, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ ఇ వసంత్, టిఎంసి ఏ. శ్రీధర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.




