ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

జనం సాక్షి, వంగూరు:
మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా కేటీఆర్ సేవ సమితి జిల్లా అధ్యక్షులు అంకు సురేందర్ ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రివర్యులు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు జరిపారు. ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు హాజరయ్యి కేక్ కట్ చేశారు. అనంతరం చౌదర్ పల్లి గ్రామానికి సంబంధించిన 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలను టిఆర్ఎస్ పార్టీలోకి కండువాలు కప్పి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమమ్మ లాల్ యాదవ్,మండల పార్టీ అధ్యక్షులు పులిజాల కృష్ణారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ సురేందర్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు అంజి, జిల్లా కోఆప్షన్ మెంబర్ హమీద్, మండల ఉపాధ్యక్షులు పుల్లయ్య మరియు వివిధ గ్రామాలకు సంబంధించిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.