Thursday, 5 November 2026

ఘనంగా కేతకీ రజక సంఘం అధ్వర్యంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 37 వ వర్ధంతి.

ఝరాసంగం సెప్టెంబర్ 10 జనం సాక్షి ఝరాసంగం మండల కేంద్రము లో తెలంగాణ వీర వనిత,భూమి కోసం, భుక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాటం చేసిన యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి ని ఝరసంగం మండల కేంద్రంలో కేతకీ రజక సంఘం అధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కేతకీ రజక సంఘం మండల అధ్యక్షుడు సి హెచ్ దత్తు, లక్ష్మణ్,శివకుమార్,బస్వరజ్, క్రిష్ణ,శ్రీశైలం,సురేష్,నర్సింహులు తదితరులు పాల్గొన్నారు