Sunday, 8 November 2026

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు….

ఫోటో :- చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేస్తున్న దృశ్యం…

రుద్రూర్ (జనంసాక్షి) :- రుద్రూర్ మండల కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం చాకలి చిట్యాల ఐలమ్మ 37 వ వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా రజక సంఘం మండల అధ్యక్షులు కొత్తింతి నాగభూషణం మాట్లాడుతూ.. పేద కుటుంబంలో పుట్టి తెలంగాణ గడ్డ మీద భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాయుధ పోరాటంలో పాల్గొని దొరలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షులు కొత్తింటి నాగభూషణం, జనగారి నర్సింలు, జనగారి జయరాం, బందెల నడిపి భూమయ్య, రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.