:శామీర్ పేట్, జనం సాక్షి :స్వాతంత్ర్య సమరయోధులు మహాత్మా గాంధీ 153 వ జయంతి,మాజీ ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి 118 వ జయంతి వేడుకలు నాయకులు ఘనంగా జరిగింది. ఆదివారం రోజు తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని హకీంపేట్ లో తూముకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్, హకీంపేట్ 9 వ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ గార్ల ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర్య సమరయోధులు మహాత్మా గాంధీ గారి జయంతి,అదేవిధంగా మాజీ ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి గారి జయంతి కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరై మహాత్మా గాంధీ విగ్రహానికి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నమసుమాంజలి తెలిపినారు,ఈ సందర్భంగా స్వాతంత్ర్య పోరాటంలో వారు చేసిన పోరాట కృషిని అదేవిధంగా భారతదేశ ప్రజానీకానికి చేసిన సేవలను కొనియాడారు.తుంకుంట లో తూముకుంట మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ నాయకులు రమేష్ ఆధ్వర్యంలో,
దేవరయాంజాల్ లో తూముకుంట మున్సిపాలిటీ 11 వ వార్డు కౌన్సిలర్ నర్సింగ్ రావు గౌడ్ మరియు వికాస మండలి సభ్యుల ఆధ్వర్యంలో హాజరై మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నమసుమాంజలి తెలిపారు.ఈ కార్య క్రమాలలో తూముకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి ,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షు లు మురళి గౌడ్ ,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు ధర్మారెడ్డి ,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు జాఫర్ ,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు హరిగోపాల్ ,మేడ్చల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శేశాంత్(బన్నీ) ,మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ ఉపాధ్యక్షులు రవీందర్ గౌడ్ ,మున్సిపాలిటీ ఎన్ ఎస్ యు ఐ అద్యక్షులు భాను ప్రకాష్ రెడ్డి ,హకీంపేట్ 9 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్ ,కార్యదర్శి పాండు గారు,హకీంపేట్ 9 వ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రవణ్ గారు,ప్రధాన కార్యదర్శి వెంకటేష, తదితరులు పాల్గొన్నారు.
3ఎస్పీటీ -1:నివాళులు అర్పిస్తున్న నాయకులు




