ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు పినపాక నియోజకవర్గం

జూలై 13 ( జనం సాక్షి): ఆషాడ వ్యాస పూర్ణ గురు పౌర్ణమి పురస్కరించుకొని మండలంలోని సాయి నగర్ లో కొలువై ఉన్న సాయిబాబా ఆలయంలో బుధవారం శ్రీ సద్గురు సాయినాధునికి ఆలయ కమిటీ వారు దూప దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ వారు మాట్లాడుతూ తెల్లవారుజామున 4:30 గంటలకు స్వామివారికి కాగడ హారతి తో మొదలై రజత సింహాసన ,సహస్ర నామ పూజ, అభిషేకం, గురుపూజ, దునిపూజ తో ఆలయ అర్చకులు సంతోష్ కుమార్ పూజా విధానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. 12 గంటలకి సాయినాధునికి హారతి భక్తుల పాటలతో ఆలయం భక్తి పారవశ్యంతో మునిగిపోయారు.హారతి అనంతరం మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం లాగా ఈ ఏడాది కూడా గురు పౌర్ణమిని ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నాము. గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశాం. సాయంత్రం సంధ్య హారతి, పల్లకి సేవ తేజ్ హారతి తో పూజా కార్యక్రమాలు ముగియనున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను తీసుకొని స్వామివారి ఆశీర్వాదం పొందాలని ఆలయ అభివృద్ధి కమిటీ కోరారు.