ఘనంగా గ్రంధాలయ పితామహుడు డాక్టర్ రంగనాదం జయంతి
మిర్యాలగూడ. జనం సాక్షి
స్థానిక కె ఎన్ ఎమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్ ఆర్ రంగనాథం 131 వ జయంతి నీ లైబ్రేరియన్ రాచ మల్ల శ్రీను అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఎస్.ఆర్.రంగనాథన్ గ్రంథాలయోద్యమములోని ప్రముఖులలో ఒకరు అని ఈయన పుట్టినరోజును జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా జరుపుకుంటున్నదుకు సంతోషం అని గ్రంధాలయాల ద్వారా తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ,గ్రంథాలయాలను ఉపయోగించుకున్న విద్యార్దులు ఉన్నత స్థాయికి చేరుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో భోధన , భోదనేతర సిబ్బంది మరియు విద్యార్దులు పాల్గొన్నారు