ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు….

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- మండల కేంద్రమైన చిలప్ చేడ్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచి లక్ష్మీదుర్గా రెడ్డి రజకసంఘం అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ  127వ జయంతి వేడుకలు సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వీరనారి తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సామాన్య కుటుంబంలో జన్మించి ఆమె పోరాట జీవితమంతా పీడిత ప్రజల కోసం పనిచేసిన మహనీయురాలని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీదుర్గా రెడ్డి రజక సంఘ అధ్యక్షులు రామకృష్ణ  రమేష్ డీలర్ అనంత గౌడ్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.