ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు

పెద్దవంగర ఆగస్టు 06(జనం సాక్షి )

సబ్బండ వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ సకల జనుల అభ్యున్నతిని సాధిస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రొ. జయశంకర్ కలను సాకారం చేస్తు,దేశంలోనే రాష్ట్రని అగ్రగామిలో ఉంచిన ఘనత కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ అని తెరాస మండల పార్టీ అధ్యక్షులు ఈదురు ఐలయ్య అన్నారు శనివారం
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్బంగా తెరాస మండల పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్ళు అర్పించడం జరిగిందని తెలిపారు. తరువాత మాట్లాడుతూ తెలంగాణ తొలి ఉద్యమ జ్యోతి, మలిదశ ఉద్యమనికి మార్గదర్శిగా మారి స్వరాష్ట్ర సాధన కోసం జీవితన్నే త్యాగం చేసిన గొప్ప మహనీయుడు అని వారి సేవలను కొనియాడారు.ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర పంచాయతీ రాజ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఆశయాలకు అనుగుణంగా మండలంలోని అన్ని గ్రామాలలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రతి గడపగడపకి అందుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముత్తినేని శ్రీనివాస్,బంధు వెంకన్న,శ్రీరాం సంజయ్, బానోత్ సోమన్న,బోనగిరి లింగమూర్తి,రైతు టీ, మల్లికార్జున చారి, ఈరెంటి శ్రీనివాస్, జలగం శేఖర్, మండ
గద్దల వెంకన్న,దంతలపెల్లి రవి,కుమారస్వామి,చిలుక బిక్షపతి,దంతలపెల్లి ఉపేందర్,సుంకరి అంజయ్య,జాటోత్ హేమని, చెరుకు యాకయ్య,చిలుక సంజీవ, ఈదురు వెంకన్న, ఎదునూరి యాకయ్య, చింతల వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు