Tuesday, 3 November 2026

*ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం*

*గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు(29):* మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర విద్యార్థులు హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ 117 వ, జయంతి సందర్భంగా పాఠశాల నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ధ్యాన్ చంద్ చిత్రపటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమాకాంత్ పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ధ్యాన్ చంద్ పుట్టిన రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటామని అర్జున్ కేల్ రత్న ద్రోణాచార్య, పద్మశ్రీ, పద్మ భూషణ్, అవార్డు దక్కించుకున్న అంతర్జాతీయ హాకీ క్రీడాకారుడు హాకీలో లెజండ్ ధ్యాన్ చంద్ అని అదేవిధంగా ప్రపంచం గర్వించదగ్గ హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ సుప్రసిద్ధ హాకీ ఆటగాడు హాకీ క్రీడలో ప్రపంచంలో అత్యుత్తమ క్రీడాకారుడు అని భారతదేశానికి హాకీలో మూడు స్వర్ణాలు తీసుకొచ్చి భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ అని అన్నారు
 భారత హాకీ ఆదిగురువు ఒలంపిక్ లో భారత్ కు స్వర్ణ పతకాలు సాధించిన అంతర్జాతీయ ఆటగాడు హిట్లర్ ను మెప్పించిన హాకీ క్రీడాకారుడు గోల్ స్కోరింగ్ లో ప్రసిద్ధుడు గా గొప్ప హాకీ క్రీడా కారుడిగా హాకీలో గెలిచి వరల్డ్ క్యాతి పొందిన వ్యక్తి ఇండియన్ ఆర్మీ లో మేజర్ గా ఉంటూ 185 మ్యాచ్లో ఆడి 570 గోల్స్ చేసిన హాకీ లెజెండ ర్ ధ్యా న్ చంద్ అని అన్నారు .
 ఆరోగ్యవంతమైన వ్యక్తి ఏ పనినైనా సాధించవచ్చు అని దేశానికి కీర్తి తెచ్చే అనేక అంశాలలో క్రీడలు కూడ ఒక భాగం అని విద్యార్థులలో ఆరోగ్యాన్ని క్రమశిక్షణను జట్టుగా పనిచే యడం పోటీతత్వాన్ని విధేయతను లక్ష్యం సాధించాలనే పట్టుదల ను పెంపొందిస్తాయి
 వ్యాయామం చేయడం మరియు క్రమం తప్పకుండా ప్రతి వ్యక్తి ఆధునిక దేవాలయాలు అయినా క్రీడా ప్రాంగణంలో అనునిత్యం సాధన చేయాలని విద్యార్థుల కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, నాగరాజు, పరమేశ్వర చారి, యాదగిరి, సంధ్య, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు