Thursday, 5 November 2026

ఘనంగా ట్రినిటీ స్కూల్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

చౌటుప్పల్ (జనం సాక్షి):
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకున్న కమనీయ 9 రోజుల పండుగలో భాగంగా 2వ రోజు అటుకుల బతుకమ్మను త్రివిటి విద్యాసంస్థలు వివిధ రకాల పూలతో అంగరంగ వైభవంగా బతుకమ్మపై అమ్మవారి గుర్తును పూలతో పేర్చి, పాఠశాలలోని విద్యార్థినులు, ఉపాధ్యాయునులు విద్యార్థుల తల్లిదండ్రులు బతుకమ్మ పాటలకు ఆడుతూ వారితోపాటు నగర మున్సిపల్ చైర్మన్ చాంబర్ చైర్మన్ అయిన వెన్రెడ్డి రాజు, నగర ప్రథమ పౌరురాలు అయిన |శ్రీమతి వెన్ రెడ్డి సంధ్య, పార్లమెంటు సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ లు విద్యార్థిని, విద్యార్థులతో కదం కలిపి బతుకమ్మ నాట్యాన్ని లయ బద్ధంగా ఆడిపాడారు. వీరితో తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ ఆదికృత విద్యాసంస్థల అధ్యక్షుడు పాపిరెడ్డి, కోశాధికారి రఘు సురేష్ పాల్గొన్నారు. 18 అడుగుల బతుకమ్మను వివిధ ఎత్తులతో
బతుకమ్మలను పూలతో పేర్చిన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ఆనందంగా కన్నుల పండుగగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రథమ పౌరుడు వెన్రెడ్డి రాజుగారు మాట్లాడుతూ త్రివిటి విద్యాసంస్థం కార్యక్రమాలను. చూసి మురిసిపోతున్నానని విద్యార్థులకు ఇన్ని రకాల పూలను పరిచయం చేయుడం తెలంగాణ సాంస్కృతిక, సంప్రదాయాలన నిర్వహిస్తున్న ఈ సంస్థను ఎలా పొగిడినా తక్కువ అనిపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బిల మురళి, గాంధీ గ్లోబల్ ట్రస్ట్ మండల మహిళా కార్యకర్తలు , ట్రినిటీ విద్యాసంస్థల డైరెక్టర్ & ప్రిన్సిపల్ డా॥ మంజుల మాట్లాడుతూ పువ్వుల విశిష్టతను, ప్రకృతిలో మనకోసం విరబూసి తియ్యని తేనెలను అందిస్తూ కనువిందు అయిన రంగులలో మన ముందు ఉంటూ . ఈ తొమ్మిది రోజులు మనతో పూజలనందుకుంటూ నదులలో, చెరువులో వదిలేయడం వెనుక ఉన్న ప్రాముఖ్యతను తెలియజేశారు.