ఘనంగా డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ జన్మదిన వేడుకలు

-వీరభద్ర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన
– కురవి మండల టిఆర్ఎస్ నాయకులు.

కురవి ఆగస్టు-20 (జనంసాక్షి న్యూస్)

డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు డీఎస్ రెడ్యా నాయక్ పుట్టినరోజు సందర్భంగా భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు బజ్జురి పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ ప్రాంగణంలో పుట్టినరోజు కేక్ కట్ చేసి స్వీట్లు,పండ్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. తదనంతరం గూడూరు మండలం ఎమ్మెల్యే రెడ్యానాయిక్ తన స్వగృహం ఉగ్గంపల్లిలో జరిగిన జన్మదిన వేడుకలో బొకే ఇచ్చి, శాలువాతో సన్మానం చేసిన కురవి మండల నాయకులు. ఈ కార్యక్రమంలో కురివి మండల అధ్యక్షుడు తోట లాలయ్య, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ ముండ్ల రమేష్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుగులోత్ రవికుమార్,ఆలయ చైర్మన్ రాము నాయక్, యూత్ అధ్యక్షుడు బానోత్ రమేష్, ఎంపీటీసీ భోజ్య నాయక్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు పెద్ద బోయిన శ్రీశైలం యాదవ్, సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, వైస్ ఎంపీపీ దొంగలి నరసయ్య, యువ నాయకులు భరద్వాజ్ రెడ్డి,తాట్య తండా గ్రామ సర్పంచ్ రమేష్, ప్రజా ప్రతినిధులు,జిల్లా నాయకులు,మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, అనుబంధ సంఘాల నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, అధికారులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.