బూర్గంపాడుకు పోలవరం ప్యాకేజీ ప్రకటించాలి.

జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత కు వినతిపత్రం అందజేత.

బూర్గంపహాడ్, ఆగష్టు 20(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో వరుస గోదావరి వరదలతో అతలాకుతలం అవుతుందని, పోలవరం ప్యాకేజీని బూర్గంపహాడ్ కు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ముంపు గ్రామస్థుల ఆధ్వర్యంలో చేపట్టుతున్న సంతకాల సేకరణ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో శనివారం స్థానిక జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలతను తన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సోమవారం చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపడుతున్న ట్లు, ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించాలని జెడ్పిటిసి శ్రీలతను కోరారు. సోమవారం చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని జడ్పిటిసి కి తెలిపారు. ఈ సందర్భంగా జడ్పిటిసి మాట్లాడుతూ బూర్గంపహాడ్ గోదావరి వరదలతో అతలాకుతలం అవుతుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని ఆమె అన్నారు. వరద బాధితులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని ఆమె పేర్కొన్నారు. వరద బాధితులకే తన మద్దతు అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బూర్గంపహాడ్ గ్రామస్తులు ఇసంపల్లి వెంకటేశ్వర్లు, తోకల రవి ప్రసాద్, కేసుపాక రామకృష్ణ, తోకల శ్రీను, నందిపాటి పండు, అలవాల దుర్గాప్రసాద్, కేసుపాక మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.