కురవి మే 5 జనం సాక్షి న్యూస్ : మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో గుడి సెంటర్లో అంగరంగ వైభవంగా డాక్టర్ జాటోతు రామచంద్రనాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాటియా తండా గ్రామ పార్టీ అధ్యక్షుడు బానోత్ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమానికి 500 మంది పైగా వచ్చారు . అలాగే మాజీ జెడ్పిటిసి కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వీరభద్రం తోపాటు తాటియ తండా గ్రామ పార్టీ అధ్యక్షులు బానోత్ రమేష్ నాయక్ అలాగే మండల నాయకులు గ్రామ నాయకులు కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ ముఖ్య నాయకులు నియోజకవర్గ స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు నాయకులు కేకులు కట్ చేసుకుని ఆనందాలతో జై రామచంద్రనాయక్ అంటూ నినాదాలు చేశారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని రాబోయే రోజుల్లో డోర్నకల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని పార్టీ నాయకులు ఆనందం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు బలగాని శీను,
కురవి మండల ప్రధాన కార్యదర్శి ఆమెర రామోహన్ రావు,కురవి మండల టౌన్ అధ్యక్షులు నారాయణ రాజేందర్, వివిధ గ్రామాల సీనియర్ నాయకులు యూత్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




