*ఘనంగా తెలంగాణ సమైక్య విమోచన దినం*

మెట్పల్లి టౌన్ ,సెప్టెంబర్ 17
(జనం సాక్షి)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మెట్పల్లి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ రాణవేణి సుజాత సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ రాణా వేణి సుజాత సత్య నారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ సమైక్య విమోచన దినాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ సల్వాది సమ్మయ్య, కౌన్సిలర్సు, కో ఆప్షన్స్ సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు