ఘనంగా దేవరంపల్లి డిప్యూటీ సర్పంచ్ జన్మదిన వేడుకలు.

 జహీరాబాద్ జులై 19 (జనంసాక్షి)  అతిథి హోటల్ లో టీ ఆర్ ఎస్  నియోజకవర్గ  నాయకుల ఆధ్వర్యంలో దేవరంపల్లి గ్రామ డిప్యూటీ సర్పంచ్ పల్లె శివశంకర్ యాదవ్ జన్మదిన సందర్భంగా శాలువా తో సన్మానించి కేకు కట్ చేసి జన్మదిన వేడుకలు  ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా  ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. దేవరంపల్లి గ్రామంలో వార్డ్ మేబర్ గా పోటీ చేసి తన మంచి తనాన్ని చూసి తనకు చిన్న తనంలోనే ఉపసర్పంచ్ గా బాధ్యతలు అప్పగించడం తో ముందు ఉండి గ్రామని అభివృద్ధి పధంలో ఉంచారు అన్నారు. యావ నాయకులు రాజకీయ గా ఎదగాలి అని తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో మాచునూరు  మాజీ సర్పంచ్ వెంకటేశం శ్రీ కేతకి సంగమేశ్వర దేవస్థానం మాజీ ఛైర్మన్ నరసింహ గౌడ్, ఏడాకులపల్లి మాజీ సర్పంచ్ మాణిక్ ప్రభుపాటిల్ పార్టీ నాయకులు దత్తు దేవరంపల్లి గ్రామ సర్పంచ్ శ్యామ్ జాగృతి ప్యాలరం ఉపసర్పంచ్ మాణిక్ యాదవ్ జాగృతి కన్వీనర్ పాండు యావ నాయకులు రమేష్ సూర్యకాంత్ బాను చింటూ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.