మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు8
ఆనంద్ భాగ్ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం నాడు అంగరంగా వైభవంగా ధ్వజారోహణం కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వాహణాికారి ఎబి రవీందర్ రెడ్డి తెలిపారు.ఉదయం సుప్రభాత సేవ,విన్నపాలు,యాగశాల ప్రవేశం,వేద పురాణ స్తోత్రం,గరుడ హోమం, బ్రహ్మోత్సవ యజ్ఞం,భేరిపూజ,దేవతా ఆహ్వానం,ఆరగింపు మంగళా శాసనము,విన్నపాలు తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.ఈకార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ముడంబై వేంకట రమణా చార్యులు,అర్చకులు తులసి వెంకట రమణాచార్యులు,ఆలయ మాజీ చైర్మన్లు ఉమేష్ సింగ్,రాందాస్ సంతోష్ ముదిరాజ్,మాజీ ధర్మ కర్తలు సునీల్ రెడ్డి,గణేష్,ఆలాపన,రవీందర్, భక్తులు దేవి,అనూష,రేఖ,జోగేష్ కుమార్,విజయ్ తదితర భక్తులు పాల్గొన్నారు .




